పులివెందుల‌లో రూ. 5163.59 కోట్లతో అభివృద్ధి పనులు..

శంకుస్థాపనలు చేసిన సీ.ఎం.జ‌‌గ‌న్

కడప : ఎపి సిఎం జగన్ తనకు జన్మనిచ్చిన పులివెందుల అభివృద్ధికోసం భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించారు. సీఎం  పర్యటనలో పులివెందుల ప్రగతి కోసం మరిన్ని అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. గతేడాది ఇదే తేదీల్లోమొద‌టి సారిగా రూ. 1329 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఆ పనులు పురోగతిలో ఉండగానే, తాజా పర్యటనలో రెండవ ద‌శ‌‌గా రూ. 5163.59 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జ‌రిగింది.

పులివెందులలో అభివృద్ధికి కేటాయించిన నిధులు:

  • ప్రధానంగా పులివెందులలో రూ. 34.20 కోట్లతో 12 ఎకరాల్లో ఆర్టీసీ బస్టాండు, డిపోలతోపాటు రూ. 83.59 కోట్లతో ఏపీ ఇమ్రా.
  • రూ. 70 కోట్లతో అపాచీ లెదర్‌ పార్కుతోపాటు రూ. 3015 కోట్లతో గండికోట, చిత్రావతి, పైడిపాలెం లిఫ్ట్.
  • రూ. 1256 కోట్లతో 1.38 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్‌ అభివృద్ధి.
  • రూ. 14.5 కోట్లతో గండి దేవస్థానం అభివృద్ధి.
  • రూ. 3.26 కోట్లతో పులివెందులలో ప్రముఖ దేవస్థానాల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
  • దీంతోపాటు రూ. 9.24 కోట్లతో 24 నూతన ఆలయాల నిర్మాణం, 23 దేవాలయాల పునర్నిర్మాణ పనులు
  • రూ. 36 కోట్లతో తొండూరులో బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూలు నిర్మాణం.
  • రూ. 46.44 కోట్లతో నియోజకవర్గ వ్యాప్తంగా పాఠశాలలకు నూతన భవనాల నిర్మాణం.
  • రూ. 184.61 కోట్లతో గ్రామాల అనుసంధానానికి 76 బీటీ రోడ్లు.
  • రూ. 29.70 కోట్లతో 29 రోడ్ల మరమ్మతులు.
  • రూ. 9.50 కోట్లతో కొత్తగా బీటీ రోడ్ల నిర్మాణం.
  • రూ. 56.85 కోట్లతో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు.
  • అలాగే రూ. 11.05 కోట్లతో కుప్పం–కల్లూరిపల్లె రోడ్డు విస్తరణ పనులు.
  • రూ. 5 కోట్లతో సురభి–కుప్పం రోడు వెడల్పు
  • రూ. 8 కోట్లతో మోపూరి దేవళాలకు రోడ్ల విస్తరణ.
  • రూ. 7 కోట్లతో చిన్నరంగాపురం–నిడివెలగల రోడ్డు విస్తరణ.
  • రూ. 8.90 కోట్లతో మోపూరి భైరవేశ్వరస్వామి దేవస్థానంలో మౌలిక వసతుల ఏర్పాటు.
  • రూ. 5.60 కోట్లతో చిత్రావతి జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి.
  • రూ. 5 కోట్లతో పైడిపాలెం జలాశయం వద్ద టూరిజం అభివృద్ధి.
  • రూ. 12.26 కోట్లతో పులివెందుల శిల్పారామం అభివృద్ధి.
  • రూ. 7 కోట్లతో చక్రాయపేట, వేముల, లింగాల మండలాల్లోని పోలీసుస్టేషన్‌ భవనాల స్థానాల్లో మోడల్‌ పోలీసుస్టేషన్‌ భవనాలనిర్మాణం. ఆర్కే వ్యాలీలో నూతన పోలీసు స్టేషన్‌ భవనాల నిర్మాణం.
  • రూ. 4 కోట్లతో నాగులగుట్టపల్లె గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాల నిర్మాణం.
  • రూ. 200 కోట్లతో పాడాలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సుందరీకరణ పనులు.
  • రూ. 2.80 కోట్లతో మైత్రి లే అవుట్, పులివెందుల డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్కు అభివృద్ధి, నియోజకవర్గంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం 33/11 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం.
  • రూ. 6.40 కోట్లతో చక్రాయపేట, నాగులగుట్టపల్లె గ్రామాల్లో పారిశుధ్య సౌకర్యాల అభివృద్ధి పనులు.
  • రూ. 14 కోట్లతో సింహాద్రిపురంలో పారిశుధ్య సౌకర్యాల మెరుగుకు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
Leave A Reply

Your email address will not be published.