ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని అమ్మితే కేసు: మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: రెండు పడక గదుల ఇళ్లు పేదవారి కల అని, ఆ కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలోని కేసీఆర్ కాలనీలో మరో 168 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగి ఇల్లు నిర్మించుకున్నా.. కొంత అప్పు అవుతుంది. ఎలాంటి అప్పు లేకుండానే పేదవారికి ఇంటి కలను సీఎం నెరవేరుస్తున్నారని చెప్పారు. అనర్హులు ఇల్లు తీసుకుంటే మరో పేదవాడికి అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. తనను విమర్శించిన బీజేపీ కార్యకర్తకు కూడా ఇల్లు వచ్చిందన్నారు. ఎవరైనా ప్రభుత్వమిచ్చిన ఇల్లును విక్రయిస్తే కేసు నమోదుచేస్తామని హెచ్చరించారు.