సర్కార్ కీలక నిర్ణయం: నియంత్రిత సాగు విధానం రద్దు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సర్కార్ రైతన్నలకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రైతులకు సంబంధించిన రైతు బంధు ఆర్ధిక సాయం ప్రారంభించబోతున్నది. దీనికోసం మొత్తం రూ.7515 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, రైతు బంధు పధకంతో పాటుగా మరొక కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకున్నది. నియంత్రిత సాగు విధానంను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. పంట కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా రూ.7500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని, కేంద్ర చట్టాలు కూడా రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.