మంచిర్యాల జిల్లా: భూమి స‌మ‌స్య ప‌రిష్కారం కోసం రైతుల స‌మావేశం..

భీమారం: మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరేపల్లె లో గ‌త 40 సంవ‌త్స‌రాలుగా సాగు చేసుకుంటున్న భూమిపై హ‌క్కు కోసం ఆదివారం ప‌లువురు రైతుల సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆరెప‌ల్లి గ్రామానికి చెందిన 38 మంది రైతులు స‌మాలోచ‌న‌లు చేశారు. వారు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న దాదాపు 90 ఎకరాల మార్వాడి భూమిపై దళారీ వ్యవస్థను అరికట్టడం పైన చ‌ర్చించామ‌ని గ్రామ సర్పంచ్ సునితా ర‌మేష్ తెలిపారు. కొంతమంది దళారులు త‌మ భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్నారని రైతులు ఆరోపించారు. ఇక ముందు ఐక్యంగా సమస్యను పరిష్కరించుకుంటామ‌ని వారు ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రైతులు తెలిపారు. ఈ స‌మావేశంలో సర్పంచ్ సునీత రామేశ్, ఉపసర్పంచ్ తిరుపతమ్మ. మాజీ ZPTC ,MPP పెద్దపల్లి తిరుపతి పటేల్, కాంగ్రెస్ నాయకులు కుమ్మరి రాయమల్లు, బండారి రామదాసు, బండారి శ్రీనివాస్, గుడిమల్లం రమేష్, అంగడి కత్తరి, పెద్దపల్లి రాజయ్య ,దిలీప్, కృష్ణమాచారి, మల్లేష్, బొందల రాజన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.