పులి దాడిలో లేగదూడ మృతి

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు ఫారెస్ట్ బీట్ పరిధిలోని దామరచర్ల అటవీ ప్రాంతంలో కంపార్టుమెంటు 426లో సోమవారం తెల్లవారుజామున పెద్దపులి సంచరించింది. నందిపాడు గ్రామానికి చెందిన మెచ్చు గంగరాజుకు చెందిన లేగదూడను చంపి సుమారు 900 మీటర్లు ఈడ్చుకెళ్లింది. సమాచారం తెలుసుకున్న రేంజర్ అబ్దుల్ రహ్మన్ సంఘటనా స్థలానికి చేరుకొని పులి జాడలు గుర్తించారు. పులి దాడిలో లేగదూడ మృతి చెందినట్లు నిర్ధారించారు.