తెలంగాణ‌లో కొత్త‌గా 474 కేసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొత్త‌గా 474 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఈ వైర‌స్ నుంచి 592 మంది కోలుకుని డిశ్చార్జి అయిన‌ట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. మొత్తంగా రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,939కి చేరగా, కోలుకున్న వారి సంఖ్య 2,78,523కు చేరింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,878 కాగా, 1,538 మంది క‌రోనాతో చ‌నిపోయారు. క‌రోనా వైర‌స్ నివార‌ణ‌కు ప్ర‌భుత్వం అన్ని రకాల చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, రాష్ర్టంలో ఇంకా సెకండ్ వేవ్ రాలేద‌ని ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.