పెళ్లి ట్రాక్టర్ బోల్తా: 25 మందికి గాయాలు

కామారెడ్డి: జిల్లాలోని దోమకొండ మండలం శివారులోని దొంగలమర్రి వద్ద పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ బోల్తా పడిన సమయంలో అందులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని కామారెడ్డిలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాస్ అజాగ్రత్తగా నడపడం వలన ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.