రెండున్నరేళ్ల‌కే ఇండియన్ బుక్ అఫ్ రికార్డు లో పేరు..

ఈ చిన్నారి వ‌య‌స్సు రెండున్న‌రేళ్లు.. సాధారణంగా ఆ ఈడు పిల్లలు ఒక దేశం జెండాను గుర్తుపట్టడమే కష్టం. కానీ, ఈ చిచ్చరపిడుగు ఏకంగా 45 దేశాల జాతీయ పతాకాలను అలవోకగా గుర్తించేస్తుంది. ఈ క్రమంలో అనేక రికార్డులు సృష్టించేస్తుంది. ఆ చిన్నారి పేరు నైర, నాన్న పేరు రాజ్ కుమార్, అమ్మ డాక్టర్ వైశాలి. ముంబై లో వుంటారు. ఈ చిన్నారి పక్కా తెలుగు అమ్మాయి.

ఇక ఆ చిచ్చ‌ర‌పిడుగు నైర ప్ర‌తిభ ఏంటంటే..

ప్రపంచ పటం లోని 45 దేశాలను సులభముగా గుర్తు పట్టగలదు పది పదిశారీర భాగాలు , 15 డైనోసర్లు, పది వివిధ ఆకారాలు, తెలుగు, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలడు, 15 మంది ప్రపంచ నేతల పేర్లు, భారత రాష్ట్రాలను సరిచేసి పెట్టగలదు. కేవ‌లం రెండున్నర ఏళ్లే కానీ ప్రతిభా వంతురాలు జ్ఞాపక శక్తిలో మేటి.. ఫలితంగా ఇండియన్ బుక్ అఫ్ రికార్డు లో పేరు నమోదు చేసుకుంది.

 

Leave A Reply

Your email address will not be published.