మే 4 నుండి సిబిఎస్ఇ పరీక్షలు

న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10, 12 తరగతులకు పరీక్ష తేదీలను కేంద్రం విడుదల చేసింది. మే 4 నుండి జూన్ 10 వరకు పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. మార్చి 1 నుండి ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించారు. జూలై 15న పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. కరోనా వై రస్ విజృంభించడంతో విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు కొత్త కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో..తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు పరీక్షలను మే నెలలో కేంద్రం జరపనుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో ఆన్లైన్ తరగతులు సరిగ్గా జరగడం లేదని విద్యార్థులు విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం..మే 4 నుండి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.