ఆన్‌లైన్‌ మనీయాప్‌ కు మరొకరు బలి..

మేడ్చల్‌ : ఈ మ‌ధ్య కాలంలో ఆన్‌లైన్ మ‌నీ యాప్‌ల వేధింపులతో  ముగ్గురు మృతి చెంద‌గా.. తాజాగా మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని గుండ్లపోచంపల్లికి చెందిన చంద్రమోహన్‌ ఆన్‌లైన్‌ మనీ యాప్‌లో కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకాలంలో డబ్బులు చెల్లించలేకపోయాడు. చంద్రమోహన్‌ ఫోన్‌లోని కాంటాక్ట్‌ నంబర్లకు ఆ విషయం చెబుతూ యాప్‌ నిర్వాహకులు మెసేజ్‌లు పంపించారు. ఈ విషయం తెలిసిన చంద్రమోహన్‌ మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. యాప్‌ నిర్వాహకులు తనను వేధిస్తున్నట్టు చంద్రమోహన్‌ గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.