సావిత్రిబాయి పేరిట వర్సిటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి: కవిత
హైదరాబాద్:సావిత్రిబాయి ఫూలే పేరుతో వర్సిటీల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి స్మృతి ఇరానీని కోరారు. సావిత్రిబాయి 190వ జయంతి సందర్భంగా స్మృతి ఇరానీకి ట్వీట్ చేశారు. గత ఏడాది కేంద్రం ప్రకటించిన ‘యూనివర్సిటీలలో ప్రముఖ మహిళా సంఘ సంస్కర్తల పేరుతో ఏర్పాటు చేయనున్న విభాగాల జాబితా’లో సావిత్రి బాయి ఫూలే పేరును చేర్చాలని కవిత విజ్ఞప్తి చేశారు. మహిళల విద్య, హక్కుల కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫూలే అని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు.
@smritiirani ji .. On the 190th birth anniversary of social reformer SavithriBai Phule, I sincerely request her name to be added to the list of eminent women chairs to be established. https://t.co/LLNORD9iOX
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 3, 2021