అబిడ్స్ మహాలక్ష్మి ఆలయంలో చోరీ

హైదరాబాద్: నగరంలోని అబిడ్స్ జగదీశ్ మార్కెట్ వద్ద గల మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం చోరీ జరిగింది. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల ప్రాంతంలో ఆలయంలోకి ప్రవేశించిన దొంగలు అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీని అపహరించుకుపోయారు. మొత్తం రూ. 70 వేల విలువ గల సొత్తును చోరీ చేసినట్లుగా సమాచారం. దొంగలు ఆలయంలోని డిస్క్ వీడియో రికార్డర్‌ను కూడా అపహరించారు. ఆలయ పూజారి తెల్లవారుజామున వచ్చి చూడగా ఆలయం తలుపులు తెరిచిఉండటం, సొత్తు మాయమవడంపై అబిడ్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.