9 నెలల తర్వాత బీహార్‌లో తెరుచుకున్న పాఠశాలలు

పట్నా: దాదాపు 9నెలల సుదీర్ఘ విరామం తర్వాత బీహార్‌లో బడులు తిరిగి తెరుచుకున్నాయి. ఇవాళ 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు క్లాసులు ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలల్లో కొవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ముఖాలకు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి చేసినట్లు చెప్పారు. కాగా, సరిగ్గా మూడు నెలలపాటు క్లాసులు జరిగిన అనంతరం మార్చి 4వ తేదీ నుంచి 9వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బీహార్ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.