ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాగ్చి ప్రమాణం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ జె.కె. మహేశ్వరి.. ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ బాగ్చి ఇంతకు ముందు కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి బదిలీపై ఇక్కడికి వచ్చారు.
జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఎపి హైకోర్టు ప్రధాన న్యామమూర్తిగా ఈనెల 6న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెకె మహేశ్వరి సిక్కిం హైకోర్టు సిజెగా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలకనున్నారు.