పోలీస్: కూతురికి `ప్రేమతో సెల్యూట్`

పోలీసు డిపార్ట్ మెంట్‌లో ఉన్న‌తాధికారుల‌కు సెల్యూట్ చెయ్య‌డం మ‌న‌కు తెలిసిందే.. కానీ ఆ ఉన్న‌తాధికారి త‌న కూతురే అయితే.. ఆ తండ్రికి ఆనందానికి అంతే ఉండ‌దు. తిరుపతి లో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి “ఇగ్నైట్” అని పేరు పెట్టారు ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి ఈ “ఇగ్నైట్” వేదికయ్యింది. అస‌లు విష‌యానికి వ‌స్తే.. 2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో “దిశ” విభాగం లో జెస్సి ప్రశాంతి భాద్యతలు నిర్వహిస్తున్నారు. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో శామ్ సుందర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యేం జ‌రిగిందంటే.. తిరుపతి లో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ శామ్ సుంద‌ర్ మురిసిపోయారు. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ డ్యూటీ చేస్తుండటం ఆయ‌నకు గ‌ర్వంగా ఉండి.. దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు. తను కూడా వెంటనే సెల్యూట్ చేసి… నాన్నా! అంటూ గట్టిగా నవ్వేశారు. ఒక తండ్రికి పిల్ల‌ల విష‌యంలో ఇంత‌కంటే ఆనందం ఇంకేమి ఉంటుంది. ఈ తండ్రి కూతురును విష‌యంపై తిరుప‌తి ఎస్పీ స్పందించారు. “ఇలాంటి సన్నివేశాలు మామూలుగా మ‌నం సినిమాల్లో చూస్తాం. కానీ డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతం గా చాలా ఘర్వంగా ఉంది.` అని ఎస్పీ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.