షేక్.బహర్ అలీ: విద్యార్థులలో ఏకాగ్రత పెంచటానికి..- పార్ట్ 2

పిల్లలకు పెద్దలకు, యువకులకు, యువతులకు, గృహిణులకు, ఉద్యోగులకు కూడా యోగ పద్ధ‌తి ద్వారా వారిని ఏకాగ్రతగా ఉండేటట్లు చేయవచ్చును. కానీ యోగ ప్రయోగలకన్న ముందు వ్యావహారిక పక్షాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం.

  •  కనీసం 6 నుండి 8 గంటలు నిద్ర పోవటానికి ప్రయతించాలి.
  • ప్రతిరోజు వ్యాయామం చేయాలి. స్కిప్పింగ్, స్విమ్మింగ్, యోగ, వాకింగ్, రన్నింగ్, చేయాలి.
  • మంచి సంగీతం వినండి.
  • ఒత్తిడి నుండి విముక్తి కావటానికి ప్రయత్నం చేయండి.
  • మీ ఏకాగ్రతకు ఇబ్బంది కలగని ప్రదేశంలో కూర్చొని చదవండి.
  • ఎక్కువగా పనిచేయకండి.చేయవలసిన ముఖ్యమైన పనులను చేయండి.
  • ఎక్కువసేపు చదవాల్సి వస్తే మధ్య మధ్యలో విశ్రాంతి ఇవ్వండి.
  • ఏకాగ్రతను పెంచే గేమ్స్ ని ఆడండి.మెదడుకు చురుకుతనం వచ్చే ఆటలను ఆడండి.
  • ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగాసనాలు చేయండి..

తక్కువ సమయంలో ఎక్కువగా ఏకాగ్రత పెంచే ఆసనాలు చేయాలి.దీని వలన a d h d పిల్లలకు కూడా ధ్యాన కాలాన్ని యోగాభ్యాసంతో సరి చేయవచ్చును.a d h d చికిత్స భాగంలో యోగ ధ్యానం,ప్రాణాయమము,చేయిస్తే మంచి ఫలితం ఉంటుంది.శరీరం ఆరోగ్యంగా ఉంటే ,మనసు కూడా పవిత్రముగా ఉంటుంది.అనేక రకముల యోగసనములు ఉన్నాయి.వారి నాడి బట్టి కొన్ని సార్లు చేయియించాల్సి వస్తుంది.దీని వలన నాడీ కణజాలంనకు ,మస్తిష్కానికి మంచి విశ్రాంతి కలుగుతుంది.దీని వలన పిల్లలకు మంచి ఏకాగ్రతి వస్తుంది.వాళ్లు శరీరానికి సంబంధించి ,తాము చేసే పనులకు సంబందించిన అవసరాల్ని కూడా అర్ధం చేసుకోగలుగుతారు.

(షేక్.బహర్ అలీ: విద్యార్థులలో ఏకాగ్రత పెంచటానికి.. :
పార్ట్‌-I)

యోగ పిల్లలకు అందరికి అంతరిక శాంతిని ప్రదానం చేస్తుంది.వారిలో సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.సృష్టిలో ఉన్న అందాలను ,ప్రకృతిని,చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న ప్రశాంతతని అనుభూతి చెందగలుగుతారు.మానసిక స్పష్టతను పెంచుతుంది.మొత్తం జీవిత క్రమానికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని ఇస్తుంది.పిల్లలలో చురుకుతనం పెరిగి మంచి బుద్ధి వస్తుంది.

పిల్లలలో గ్రహింపు శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది.ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.దీని వలన అంతస్రావం, ,శ్వాస వ్యవస్థ,మెరుగుపడుతుంది.శారీరకంగా మానసికంగా దృఢంగా అవుతారు.యోగం, మనసు, శరీరం,ఆత్మలకు మాత్రమే కాకుండా ఇతర ఇంద్రియాల మధ్య కూడా గొప్ప సమన్వయాన్ని ఉపకరిస్తుంది.

యోగ చేయటం వలన పిల్లలలో ఉద్వేగాల్ని నియంత్రిచవచ్చును. గుండె, నాడీ గతి, అంతప్రసారం క్రమబద్ధమౌతాయి. శారీరక ప్రయోజనాలే కాకుండా పిల్లలలో మానసిక ప్రశాంతత నెలకొంటుంది.ఉన్న బిజీ జీవితంలో విశ్రాంతి లభిస్తుంది. ధ్యానంలో కూర్చొని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాధలు కూడా పోతాయి. శరీరంలో అన్ని వ్యవస్థలలో ఒక సమన్వయం సాదించబడుతుంది. భారమైన మనసు కూడా ఉత్తేజితమౌతుంది. యోగ ద్వారా మస్తిష్కం లో ఆక్సీజన్ మోతాదు పెరుగుతుంది. సాధకులు ప్రసన్నంగా వుంటారు. ఏకాగ్రత సాధిస్తారు.

శ్వాస సంతులనలో మంచి మార్పు వస్తుంది. పిల్లలు చురుకుగా వుంటారు. ఉద్రేకం, భావ తీవ్రతకు లోను కావటం అదుపులోకి వచ్చి , ఏకాగ్రత స్థాయిలో మంచి మార్పు కనిపిస్తుంది. అలా ఆసనాలు చేయటం వలన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, సంస్కృతీ పరంగా, సంస్కారపరంగా పిల్లలు పెరుగుతారు. వీరికి ఏకాగ్రతకు కావాల్సిన యోగా శిక్షణ ఆన్లైన్ తరగతులకు మాకు సంప్రదించగలరు.

-షేక్. బహర్ అలీ.
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.