మహబూబాబాద్ జిల్లాలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి

మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ మండలం ఆమనగల్లు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాధమ్మ (49) బట్టలు ఉతికి ఆరేస్తుండగా జీ వైర్ తీగకు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురైంది. రక్షించేందుకు యత్నించిన భర్త సత్తయ్య (59) సైతం విద్యుదాఘాతానికి గురయ్యాడు. వీరు ఇరువురు రక్షించండని కేకలు వేయడంతో ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య-లక్ష్మి దంపతులు వీరిని రక్షించే యత్నంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను మహబూబాబాద్ జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.