వైభవంగా వైసీపీ కార్యాలయంలో గృహప్రవేశం చేసిన తోట త్రిమూర్తులు

మండపేట: మండపేట పట్టణం విజయలక్ష్మి నగర్ లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని శనివారం రాత్రి 9:40 నిమిషములకు మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు ఆయన సతీమణి సూర్య కుమారి తనయుడు పృథ్వీ గృహ ప్రవేశం చేశారు. మేళతాళాలతో, పండితుల వేద మంత్రాలతో హిందూ సాంప్రదాయ బద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి పతివాడ నూక దుర్గారాణి, కపిలేశ్వరపురం జెడ్పీటీసీ అభ్యర్థి పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ(నిడసెనమెట్ట ఆబ్బు), టౌన్ కన్వీనర్ ముమ్మిడివరపు బాపి రాజు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు షేక్ అలీఖాన్ బాబా, మీగడ శ్రీనివాస్, ఏడిద సర్పంచ్ అభ్యర్థి బూరిగ ఆశీర్వాదం, జిన్నూరి సత్యసాయిబాబా, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతంశెట్టి ప్రసాద్, మండల కన్వీనర్ పిల్లా వీరబాబు, మైనారిటీ సెల్ నాయకులు సయ్యద్ రబ్బానీ, సిరంగు శ్రీనివాస్, టి పుల్లేశ్వరరావు, హైకోర్టు న్యాయవాది టివి గోవిందరావు, సీతిని సూరిబాబు, సాధనాల శివ భగవాన్, కౌన్సిలర్ అభ్యర్థులు మలసాని సీతా మహాలక్ష్మి, గ్రంథి శ్రీనివాస్ నాయకులు ముక్కా దాలయ్య, ముక్కా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.