13 శాతం పెరిగిన చలామణిలో ఉన్న కరెన్సీ: ఆర్బీఐ

ముంబయి: 2020, మార్చి 31వతేదీన చెలామణిలో ఉన్న కరెన్సీ మొత్తం విలువ రూ.24,47,312 కోట్లు కాగా.. అది జనవరి, 2021 నాటికి రూ.3, 23,003 కోట్లు పెరిగి రూ.27,70,315 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ డేటా వెల్లడించింది. లాక్‌డౌన్‌లో ఏదైనా అత్యవసర వినియోగం కోసమంటూ ప్రజలు ఇళ్లలో నగదును ఎక్కువగా ఉంచుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ చెప్పారు. కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలలో దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ (కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ సీఐసీ)) ఏకంగా 13 శాతం పెరిగినట్లు ఆర్బీఐ తాజా డేటా వెల్లడించింది.