రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణ సిరి సంపదలతో, బోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.
అలాగే ప్రజలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.