విద్యాసంస్థ‌ల ప్రారంభానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాలి: మ‌ంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

హైద‌రాబాద్: క‌రోనాతో మూత‌ప‌డిన విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీల కార్య‌ద‌ర్శుల‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఆదేశించారు. విద్యా సంస్థల ప్రారంభంపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయాల్సిందిగా ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నదీమ్ అహ్మద్, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి షఫీవుల్లా,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌ల‌ను మంత్రి ఆదేశించారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యా సంస్థ‌ల ప్రారంభానికి అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాల‌న్నారు. పరిసరాలు, తరగతి, వంట గదులు, వంటపాత్రలు, వాష్ రూములను శుభ్రం చేయించాల‌న్నారు. నిత్యావసర వస్తువులు సకాలంలో అందేలా ప్రణాళికలు రూపొందించాల‌ని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.