మహారాష్ట్రకు అత్యధికంగా 9.63 లక్షల డోసులు

ముంబయి: భారత్‌లో మొదటి నుంచి కరోనా మహమ్మారి మహారాష్ట్రలోనే అధికంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అత్యధిక కేసులు, అత్యధిక మరణాల్లో మహారాష్ట్ర దేశంలోనే తొలి స్థానంలోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో తొలి విడతగా మహారాష్ట్రకు అత్యధికంగా కరోనా టీకాలు సరఫరా అయ్యాయి. సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ టీకాలు 9.63 లక్షల డోసులు పూణేలోని ఆరోగ్యశాఖ అధికారులకు చేరాయి. అక్కడి నుంచి మహారాష్ట్రలోని పలు నగరాలకు రవాణా చేశారు. ముంబయికి తొలి విడత కోవిషీల్ట్ టీకాలు బృహన్ ముంబై కార్పొరేషన్‌కు చెందిన వాహనాల్లో చేరాయి.