బైక్ అదుపుతప్పి ఇద్దరు మృతి

పెద్దకొత్తపల్లి: నాగర్కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం గంట్రావ్పల్లిలో భోగి నాడు విషాదం నెలకొంది. హైదరాబాద్ నుండి పండుగ జరుపుకోవడానికి స్వగ్రామానికి వస్తూ బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడి ఇద్దరు మృతి చెందారు. గంట్రావ్పల్లి గ్రామానికి చెందిన బంధువులైన ఎం వెంకటస్వామి (52), లక్ష్మి (25) హైదరాబాద్లో ఉంటున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో బైక్పై ఇవాళ ఉదయం స్వగ్రామానికి బయల్దేరారు. కల్వకుర్తి మండలం జేపీనగర్ అండర్ బైపాస్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలై లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటస్వామిని కల్వకుర్తి దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.