మారణాయుధాలతో తిరగడంపై ఎపి సర్కార్ సంచలన నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదునైన మారణాయుధాలతో తిరగడంపై ఎపిలో జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం ఎపి మొత్తం వర్తించదు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఈ నిషేధం అమలు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 16 నుంచి వరుసగా ఆరు నెలల పాటు అమలులో ఉంటుంది.