మహారాష్ట్రలో కొత్తగా 3,579 కరోనా కేసులు.. 70 మరణాలు

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు మహారాష్ట్రలో కొత్తగా 3,579 కరోనా కేసులు నమోదయ్యాయి. 70 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,81,623కు, మరణాల సంఖ్య 50,291కు పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 3,309 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,77,588కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 52,558 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.