తెలంగాణ క్యాడర్‌కు 9 మంది, ఎపి క్యాడర్‌కు 8 మంది ఐఏఎస్‌లు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం 9 మంది ఐఏఎస్‌లను తెలంగాణ క్యాడర్‌కు, 8 మంది ఐఏఎస్‌లను ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది.. ఈ మేరకు దేశంలోని 25 రాష్ట్రాలకు 179 మంది యువ ఐఏఎస్‌లను కేటాయిస్తూ శుక్రవారం అన్ని రాష్ర్టాల సీఎస్‌లకు ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ర్టానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల్లో బీ రాహుల్, మంద మకరందు సొంత రాష్ట్రం తెలంగాణే. రాష్ర్టానికి కేటాయించిన ఐఏఎస్ అధికారుల్లో బీ రాహుల్, మంద మకరందుతోపాటు సామయాంక్ మిట్టల్ (ఉత్తరప్రదేశ్), అపూర్వ్‌చౌహన్ (ఉత్తరప్రదేశ్), అభిషేక్ అగస్త్యా (జమ్ముకశ్మీర్), అశ్వినీ తనాజీవాకడే (మహారాష్ట్ర), ప్రతిభాసింగ్ (రాజస్థాన్), ప్రపుల్ దేశాయ్ (కర్ణాటక), పీ కదిరవన్ (తమిళనాడు) ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్‌లు పీ ధాత్రిరెడ్డిని ఒడిశాకు, కట్టా రవితేజ, బానోతు మృగేందర్‌లాల్‌ను తమిళనాడుకు కేటాయించారు.