టీకా ఎఫెక్ట్?: నార్వేలో 23 మంది వృద్ధులు మృతి

నార్వే : బలహీనంగా ఉన్న వృద్ధులకు.. కోవిడ్ టీకాతో ప్రమాదం ఉన్నది. నార్వే దేశంలో తొలి డోసు తీసుకున్న వృద్ధుల్లో 23 మంది మరణించినట్ల ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరీ బలహీనంగా ఉన్న వృద్ధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. ఏమాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధులకు టీకా ఇస్తే, వారిలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించారు. అయితే, ఆరోగ్యవంతులు, యువకులు టీకాను తీసుకోవచ్చని నార్వే ప్రభుత్వం చెబుతోంది.
వైరస్ బారిన పడిన సుమారు 33 వేల మందికి ఇప్పటి వరకు నార్వేలో టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావం ఉండగా… దీనిలో మూడో వంతు 80 ఏళ్లు దాటినవారే. 80 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. వృద్ధుల మృతిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా నిర్థారించలేదని, మరణించిన 23 మందిలో 13 మంది విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. నార్వేలో టీకా మరణాలతో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు.