తెలంగాణ‌లో కొత్త‌గా 249 క‌రోనా కేసులు

హైద‌రాబాద్ :గ‌త 24 గంట‌ల్లో ‌తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 249 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా ఒక‌రు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 1575 మంది చ‌నిపోయారు. ఈ మేర‌కు శ‌నివారం రాష్ర్ట వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,91,367కు చేరుకోగా, ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,273గా ఉంది. ప్ర‌స్తుతం హోంఐసోలేష‌న్‌లో 2,381 మంది ఉన్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 417 మంది కోలుకోగా, ఇప్ప‌టి వ‌ర‌కు 2,85,519 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 54 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.