ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ నూ వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి టీకా కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. జీజీహెచ్‌లో హెల్త్ వర్కర్ పుష్పకుమారికి తొలి టీకా ఇచ్చారు. అనంతరం హెల్త్ వర్కర్ నాగజ్యోతి, హెల్త్ వర్కర్ జయకుమార్‌కు టీకా వేశారు.
తెలంగాణలో టీకా కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.