గుంటూరు జిల్లాలో ప్రేమ‌జంట ఆత్మ‌హ‌త్య‌

గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ‌జంట చెట్టుకు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వివేకానంద న‌గ‌ర్‌కు చెందిన ప్ర‌దీప్తి ఇంట‌ర్ చ‌దువుతోంది. ప్ర‌దీప్తికి స్థానికంగా ఉండే కిర‌ణ్(తాపీ మేస్ర్తీ) ప‌రిచ‌య‌మ‌య్యాడు. వీరి స్నేహం ప్రేమ‌గా మారింది. ఈ విష‌యం యువ‌తి ఇంట్లో తెలియ‌డంతో.. ఆమెను మంద‌లించారు. కిర‌ణ్‌ను కూడా హెచ్చ‌రించారు. త‌మ పెళ్లికి పెద్ద‌లు ఒప్పుకునేలా లేర‌ని భావించిన ఆ ఇద్ద‌రు ఇంట్లో చెప్ప‌కుండా బ‌య‌ట‌కు వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ మ‌రుస‌టి రోజే చెట్టుకు ఉరేసుకున్నారు ప్ర‌దీప్తి, కిర‌ణ్‌. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.