గోదావరికి వాయనం సమర్పించిన కెసిఆర్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ఉదయం కాళేశ్వరంలోని ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఎం దంపతులకు ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని అనంతరం ప్రాణహిత, గోదావరి సంగమ స్థలి పుష్కర ఘాట్ వద్ద నదీమ తల్లికి పసుపు కుంకుమ, పూలతోపాటు నాణాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
కాళేశ్వరం పర్యటనకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్ జక్కు హర్షిని సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.