తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై

తిరుమల: రెండు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కుటుంబ సమేతంగా ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం గర్నవర్‌ను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గవర్నర్ నేరుగా రోడ్డు మార్గంలో కాణిపాకం వెళ్లి వరసిద్ధి వినాయకుని దర్శించుకొని నిన్న రాత్రికి తిరుమలకు చేరుకున్నారు. కాగా తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాల గోల్డెన్‌జూబ్లీ వేడుకలకు హాజరుకానున్నారు.