గుంటూరు: వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశావర్కర్‌ మృతి

అమరావతి: గుంటూరు జిల్లాలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ ఆశావర్కర్‌ మరణించారు. జిల్లాలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మి వాక్సినేషన్‌లో భాగంగా ఆమె ఈ నెల 19న టీకా వేయించుకున్నారు. ఆ త‌ర్వాత కేవ‌లం రెండు రోజుల్లోనే అస్వస్థతకు గుర‌వ్వ‌డంతో కుటుంబ సభ్యులు ఆమెను జీజీహెచ్‌లో జాయిన్ చేశారు. కాగా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ విజ‌య‌ల‌క్ష్మి మరణించారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌తోనే ఆశావ‌ర్క‌రు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు ఆదివారం ఉదయం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.