ఒక్క రోజు సీఎంగా శ్రీష్టి గోస్వామి

డెహ్రాడూన్: దేశంలో ఎవరికీ దక్కని అరుదైన అవకాశం 19 సంవత్సరాల విద్యార్థిని శ్రీష్టి గోస్వామికి లభించింది. భారత దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఆదివారం ఓ రాష్ట్రానికి ఒక్క రోజు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కొట్టేసింది. ఓ సాధారణ వ్యక్తి ముఖ్యమంత్రి అయిన అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 2018వ సంవత్సరంలో బాలల హక్కులు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఆ రాష్ట్ర కమిటీ విద్యార్థులతో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో బీఎస్పీ అగ్రికల్చర్ విద్యార్థిని అయిన శ్రీష్టి గోస్వామి సీఎంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆమె రియల్‌గా ఒక రోజు సీఎంగా ఉండేందుకు ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ అంగీకరించారు. హరిద్వార్‌కు చెందిన శ్రీష్టి సిఎంగా బాలికల సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. తనకు ఒక్క రోజు సీఎంగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్‌కు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాగా తమ కుమార్తెకు ఇలాంటి అరుదైన అవకాశం రావడంపట్ల శ్రీష్టి గోస్వామి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.