తెలంగాణ‌లో కొత్త‌గా 148 క‌రోనా పాజిటివ్ కేసులు

హైదార‌బాద్‌:తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య త‌గ్గుతోంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 148 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కాగా కొవిడ్‌తో చికిత్స పొందుతూ ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు రాష్ట్రవైద్య ఆరోగ్య‌శాఖ సోమ‌వారం హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా తాజాగా కోలుకున్న వారు 302 మంది. కొత్త‌గా కోలుకున్న వారితో క‌లిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,88,577 మందికి చేరింది. కాగా రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1590 మంది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 3,234 మంది ఈ మేరకు బులిటెన్‌లో అధికారులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.