సరదాగా కాసేపు క్రికెట్ ఆడిన మంత్రి ఎర్రబెల్లి!

వరంగల్: రోజంతా ఎంతో బిజిబిజిగా ప్రజా శ్రేయస్సుకోసం పాటుపడే తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జిల్లాలోని పర్వతగిరి మండలంలో సరదాగా కాసేపు క్రికెట్ ఆడి అక్కడి యువకులను ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా ఇవాళ (సోమవారం) ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు మంత్రి. ఈ క్రమంలో పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఉన్న ఆటస్థలంలో కొందరు యువకులు క్రికెట్ ఆడుతూ తారసపడ్డారు. ఆ మరుక్షణమే మంత్రి వారితో కలిసిపోయి క్రికెట్ ఆడారు. యువకులతో సరదాగా మాట్లాడుతూ.. బ్యాటింగ్ చేశారు… బౌలింగ్ కూడా చేశారు. ఊహించని విధంగా ఏకంగా రాష్ట్ర మంత్రి తమతో క్రికెట్ ఆడటంతో ఆ యువకులు ఆనందం వ్యక్తం చేశారు.