ఇవాళ ప్రత్యేక పగిడీ ధరించిన మోడీ

న్యూఢిల్లీ: స్పెషల్ డే రోజు స్పెషల్ కనిపిస్తుంటారు మన ప్రధాని మోదీ. ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన కొత్త లుక్‌లో కనిపించారు. తలకు ఎర్రటి తలపాగ (ప్రత్యేక పగిడీ) ధరించారు. ఇవాళ నేషనల్ వార్ మెమోరియల్‌కు వచ్చిన సమయంలో ప్రధాని ఈ పగిడీలో దర్శనమిచ్చారు. ఈ రోజు మోడీ ధరించిన పగిడీకి ప్రత్యేకత ఉన్నది. అదేంటంటే.. జామ్‌నగర్‌కు చెందిన రాజ కుటుంబీకులు ఈ తలపాగను మోడీకి బహూకరించారు. ప్రత్యేక వేషధారణతో ఆకట్టుకునే ప్రధాని ఇవాళ కూడా ఈ స్పెషల్ డ్రెస్సులో దర్శనమిచ్చారు.