భీవండిలో అగ్నిప్రమాదం

భీవండి: మహారాష్ట్రలోని భీవండీ పారిశ్రామిక వాడ‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్క‌డి ఎండీఐసీ (మహారాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ)కు చెందిన పారిశ్రామిక వాడలో ఉన్న ఓ గోదామ్‌లో ఇవాళ (గురువారం) తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంట‌లు విస్త‌రించి గోదామ్ అంతా మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఐదు ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.