నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించాలి..

ఖ‌మ్మం: నేరాల నియంత్రణలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసు అధికారులకు ఆదేశించారు. నెలవారీ నేర సమీక్ష సమావేశం ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలు, పెండింగ్ కేసుల్లో పురోగతి, కేసుల నమోదు, దర్యాప్తు, చార్జ్ షీట్, డయల్ 100 తదితర ఆంశలపై పోలీసు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. నేర రహిత సమాజ లక్ష్యంకోసం మరింత సమర్థవంతంగా పనిచేయల్సిన అవసరం వుందని పెర్కొన్నారు. అసాంఘిక శక్తులపై ముందస్తు సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకోవాలని, రౌడీలు, సస్పెక్ట్ లపై ప్రత్యేక నిఘా వుంచి వారి కదలికపై ఆరా తీయాలని తెలిపారు.
ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి పురోగతి సాదించాలని, కేసులను పరిష్కరించే విషయంలో ఆలసత్వం వహించకూడదని, పోలీస్ విధులను క్రమశిక్షణతో సక్రమంగా నిర్వహిస్తే ఫలితం అదే వస్తుందని అన్నారు. ప్రతికేసు విషయంలోను నేరుగా వ్యక్తిగతంగా విచారించాలని సూచించారు. కేసు జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి పూర్వపరాలను పరిశీలించినప్పుడే కేసుపై పట్టు సాధించి కేసును చేదించడానికి అవకాశం వుంటుందని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలని, కార్దన్ సెర్చ్, వాహనాల తనికీలు ప్రతిరోజు ఉధృతం చేయాలని ఏసీపీ స్థాయి అధికారి ప్రత్యేక శ్రద్ద తీసుకొని క్రమం తప్పకుండా తనికీలు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచనలు చేసారు.

మీ మీ పరిధిలో ఎక్కువగా నేరములు జరుగు ప్రాంతాలను గుర్తించి, అక్కడ పోలీస్ పెట్రోలింగ్ జరిగే విదంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా మీ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరుగు ప్రాంతాలు గుర్తించి అక్కడ తగిన సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించాలన్నారు. నగర పరిధిలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య లేకుండా పరిష్కరించాలని సూచించారు.. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, శాంతి భద్రతల విషయంలో అధికారులు అలసత్వానికి తానివ్వరాదని సూచించారు. ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా జవాబుదారీగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ ఆడ్మీన్ ఇంజరాపు పూజ, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ మురళీధర్, ఏసీపీలు అంజనేయులు, వెంకటరెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్, రామోజీ రమేష్, ప్రసన్న కుమార్, వెంకట్రావు, నాయక్, జహాంగీర్, SHO లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.