భారీగా పెరిగిన వంట గ్యాస్ ధర..

హైదరాబాద్: చమురు కంపెనీల నిర్ణయంతో గ్యాస్ `బండ` సామాన్యుడి నడ్డీ విరుస్తోంది. వంటగ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెంపు నిర్ణయం ఈరోజు నుంచే అమలులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలు పెంచగా.. ఈ ఏడాదిలో తొలిసారిగా గ్యాస్ ధరలు పెరిగాయి.
సబ్సిడీ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెంచాయి. సవరించిన ధరలు గురువారం నుంచే కొత్త రేట్లు అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.664 ఉండగా.. తాజాగా పెంచిన ధరతో రూ.719కి చేరింది. లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719గా మారగా, చెన్నైలో రూ.735, బెంగళూరులో రూ.722 రూపాయలుగా, హైదరాబాద్‌లోని రూ.771.50కు చేరాయి.