ఆర్థిక రుణాల కోసం ఆన్ లైన్ దరఖాస్తులకు గడువు పెంచాలి..
విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్
కామారెడ్డి: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సోమవారం విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఈనెల 10వ తేదీ వరకు ఆర్థిక రుణాల కోసం ఆన్లైన్ దరఖాస్తు గడువు మరియు ఉపకార పరికరాల కోసం గడువు వచ్చే నెల వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. రుణాల కోసం, పరికరాల కోసం ఆన్ లైన్ వెబ్ సైట్ లో ఒకటిగా ఉన్నందున ఏదో ఒకటి మాత్రమే వెబ్సైట్ దరఖాస్తు తీసుకుంటుందని, దివ్యాంగులకు బహుళ ప్రయోజనాలు చేకూరాలంటే వెబ్సైట్లో పొందుపరచాలని కోరారు.
అలాగే మండలాల వారీగా సదరం శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా బస్సు, రైళ్ల పాసులు కూడా ఇవ్వాలని కోరారు. వెబ్ సైట్ లో మార్పులు చేయకుంటే మరియు పూర్తి సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల ఒకటో తేదీన దివ్యాంగుల మహా ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్రాజ్ గౌడ్, నితీష్ రెడ్డి, నర్సింలు, కొండల్ రెడ్డి చంద్రయ్య లక్ష్మి రాజవ్వ నయీమ్ నయీమ్ శంకర్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.