పదోన్నతులు, 45% ఫిట్మెంట్ తో PRC ఇవ్వాలి..
-పి ఆర్ టి యు టి ఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్
పెద్దపెల్లి: పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం విజయవంతం అయిందని ఆ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రు సురేష్, చలువాజి నాగేశ్వర్ రావు లు తెలిపారు. పి ఆర్ సి, సి పి ఎస్ రద్దు, ప్రమోషన్స్ లు ఇతర అనేక పెండింగ్ సమస్యల పై ప్రభుత్వం వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నిర్వహించిన మహా ధర్నా కు దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులు హాజరై ధర్నాను విజయవంతం చేసారని అన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఏం బి గార్డెన్స్ నుండి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి కమాన్, అయ్యప్ప గుడి మీదుగా కలెక్టరేట్ వద్దకు చేరి ధర్నా కార్యక్రమము ప్రారంభించారు. పి ఆర్ టి యు టి ఎస్ ఆవిర్భావ రోజు మరియు స్వర్ణోత్సవ వేడుకల సందర్బంగా సంఘం జెండాను ఎగురవేసి సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు సామల యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించి ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించారు. ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. వెంటనే 45% ఫిటిమెంట్ తో పి ఆర్ సి ని ప్రకటించాలి. సి పి ఎస్ ని రద్దు చేయాలి. ప్రమోషన్స్ షెడ్యూల్ ని వెంటనే విడుదల చేయాలి.
మోడల్ స్కూల్ ఉపాద్యాయులకు నోషనల్ సర్వీస్ ,PGT లకు జెల్ స్కేల్ వర్తింపజేయాలని మరియు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని, కె.జి.బి.వి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి. ఎం. ఆర్. సి సిబ్బంది వేతనాలను పెంచాలి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PMTA-TS రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనుముల పోచయ్య, PRTU సంఘ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పి.సంపత్ రావు,బి. రవినందన్ రావు,సి.హెచ్ శ్రీకాంత్ రావు, పి. శ్రీధర్ రావు,వెంకటలక్ష్మి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపత్ రెడ్డి, శ్రీనివాస్, రాజారామ్, రవీందర్, రాష్ట్ర కార్యదర్శులు సదాశివ,తిరుపతి, శ్రీధర్ రెడ్డి, సూర్యనారాయణ, జిల్లా నాయకులు, 14 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.