తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్: తెలంగాణలో అండర్ డ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2021-22 సంబంధించి వివిధ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సిఇటి) షెడ్యూల్‌ను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టిఎస్‌సిఇ) శుక్ర‌వారం విడుదల చేసింది. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)ను జూలై 5, 2021 నుంచి జూలై 9, 2021 వరకు టీఎస్‌ ఎంసెట్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కాగా తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం మూడు ఎంట్రెన్స్‌లకు మాత్రమే తేదీలు ప్రకటించింది. మిగతావి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో పెండింగ్‌లో ఉంచింది. ఐసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీఈసెట్‌‌ పరీక్షల తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

కాగా ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ డైరెక్టర్ ఎ.గోవర్ధన్‌ను ఎంసెట్ 2021-22 కన్వీనర్‌గా నియమించారు. ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటీకి అప్పగించారు.

పరీక్షల షెడ్యూల్‌..

  • జూన్‌ 20న పీజీ ఈసెట్‌
  • జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్‌
  • జూలై 1న ఈ-సెట్‌

Leave A Reply

Your email address will not be published.