ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య

అనంతపురం: జిల్లాలోని పరిగి మండలంలో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జయమంగలినది సమీపంలోని సూర్య రాక్స్ వెనక ఉన్న ఓ వేప చెట్టుకు సోమవారం ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా రేకులపల్లితాండకు చెందిన ఎం.భాస్కర్ (25) కూలి పని కోసం పరిగికి వచ్చాడు. కాగా శివమాల ధారణకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి లోనై భాస్కర్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.