జమ్మూలోఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఆగడాలు మితిమీరుతున్నాయి. అక్కడ రోజుకో ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. అయిన ఉగ్రమూకలు చొరబాట్లు, ఆగడాలు ఆగడం లేదు. తాజాగా ఈ రోజు శనివారం పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా దళాలు మట్టుబెట్టాయి. నిన్న (శుక్రవారం) అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ ఆపరేషన్ పుల్వామాలోని జదూరా ప్రాంతంలో ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. కాగా, షోపియాన్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే. దీంతో లోయలో 24 గంటల్లో మరణించిన మొత్తం ఉగ్రవాదుల సంఖ్య ఏడుకి చేరుకుందని అధికారులు వెల్లడించారు. నేడు జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలు ఆపరేషన్ పూర్తయ్యాక తెలిపుతామని అధికారులు పేర్నొన్నారు.