తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. కాగా ఇప్పటి రాష్ట్రంలో వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది. వారిలో 2,94,243 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనాతో తాజాగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 1624కి చేరింది. కాగా 1731 కేసులు యాక్టివ్ గా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.