అమరావతి జిల్లాలో 7 రోజులు లాక్‌డౌన్

ముంబయి: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న అమరావతి జిల్లాలో సోమవారం నుంచి వారం రోజులు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర మంత్రి యశోమతి ఠాకూర్ ఇవాళ (ఆదివారం) తెలిపారు. అమరావతి నగరంతో పాటు అచల్‌పూర్ పట్టణంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలకు కేవలం నిత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తామని మీడియాకు చెప్పారు. కాగా ఇప్పటికే పుణెలో ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లు, కాలేజీలను బంద్ చేశారు. అలాగే ఆ ప్రాంతంలో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవర్ తెలిపారు.