ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వాణీదేవి నామినేష‌న్

హైద‌రాబాద్ : రంగారెడ్డి – హైద‌రాబాద్-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ స్థానానికి టిఆర్ ఎస్ అభ్య‌ర్థిగా మాజీ ప్ర‌ధాని పివి న‌ర‌సింహారావు కుమార్తె సుర‌భి వాణీదేవి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అంత‌కు ముందు పివి ఘాట్కు వెళ్లిన ఆమె.. మంత్రి త‌ల‌సాని, కె. కేశ‌వ‌రావుతో క‌లిసి నివాళుల‌ర్పించారు. అక్క‌డి నుండి వారు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లి సిఎం కెసిఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణిదేవి, హైద‌రాబాద్‌, ఉమ్మ‌డి రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌య్యారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై నేత‌ల‌కు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అనంత‌రం టీఆర్ఎస్ అభ్య‌ర్థి వాణిదేవికి కేసీఆర్ బీ ఫార్మ్ అంద‌జేశారు.

స‌మావేశం ముగిసిన అనంత‌రం వాణిదేవి.. గ‌న్‌పార్క్‌కు వెళ్లారు. అక్క‌డ అమ‌ర‌వీరుల స్థూపానికి వాణిదేవి నివాళుల‌ర్పించారు. అనంత‌రం త‌న నామినేష‌న్‌ను దాఖ‌లు చేసేందుకు జీహెచ్ఎంసీ కార్యాల‌యానికి బ‌య‌ల్దేరారు.

 

(ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై కెసిఆర్ దిశానిర్దేశం)

Leave A Reply

Your email address will not be published.