మెట్రోకు ఒకే.. బ‌డుల‌కు నో..

న్యూఢిల్లీ : ప‌్ర‌పంచ వ్యాప్తంగా ప‌లుదేశాలు కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తూనే ఉన్నారు. కోవిడ్ తీవ్ర‌త‌, కేసుల న‌మోదు, రిక‌వ‌రీ, వైర‌స్ వ్యాప్తి.. తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లను చ‌ర్చిస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే భార‌త్‌లో కూడా కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలను శనివారం స‌ర్కార్ విడుదల చేసింది. వీటిలో పలు కీలక రంగాలకు ఆంక్షల నుంచి సడలింపులు కల్పించింది. కేంద్రం తాజాగా ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం.. సెప్టెంబర్‌ 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. అది కూడా దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతినిచ్చింది. సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలు, షాపింగ్‌మాల్స్‌ తెరవకూడదని కేంద్రం పేర్కొంది. మరోవైపు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం మరికొన్నాళ్ల పాటు కొనసాగిస్తామని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే సెప్టెంబర్‌ 21 నుంచి 100 మందితో సభలు, సమావేశాలకు అనుమతిచ్చింది. కానీ రోజురోజుకు బార‌త్‌లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎలా చూసినా క‌రోనాను అదుపు చేయ‌డంలో ప్ర‌భుత్వాలు ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌డంలేదు. ఇప్పుడు న‌గ‌రాల నుంచి ప‌ట్ట‌ణాల‌కు.. ప‌ట్ట‌ణాల నుంచి ప‌ల్లెల‌కు వ్యాపించింది. కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. ఈ స‌మ‌యంలో కేంద్రం మ‌రికొన్ని స‌డ‌లింపుల‌తో అన్‌లాక్ 4.0 మ‌ర్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.