గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. కరోనా నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవల గవర్నర్ బాబాయి, తమిళనాడులోని కన్యాకుమారి ఎంపీ వసంత్‌కుమార్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చి సంతాపం తెలిపిన ముఖ్యమంత్రికి గవర్నర్ తమిళిసై ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. కాగా కరోనా వైరస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వసంత్‌కుమార్ శుక్రవారం రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి.